Mahaa Daily Exclusive

  ఏ ఎన్ ఎన్ తెలుగు ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

Share

షాద్ నగర్, మహా

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏ ఎన్ ఎన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. నేడు ఏ ఎన్ ఎన్ న్యూస్ ఛానల్- మహా పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని, గతంలో ఏ ఎన్ ఎన్ న్యూస్ ఛానల్ సంచలన వార్తలను వెలికితీసి, ప్రజా వ్యతిరేక విధానలను బయటపెట్టిందని ప్రజలకు ప్రజా సామస్యలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వెలుగులోకి తెస్తుందని అన్నారు. పత్రికలు, న్యూస్ ఛానెల్ లు ఎల్లపుడు ప్రజా సమస్యలు వెలికిస్తూ ప్రజలకు అనునిత్యం ఏ ఎన్ ఎన్ న్యూస్ ఛానల్ అందుబాటులో ఉండాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రతి ఒక్కరు ఏ ఎన్ ఎన్ న్యూస్ ఛానల్ రాశి ఫలాలను అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఏన్ఎన్ షాద్ నగర్ రిపోర్టర్ సయ్యద్ సాబేర్ , జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు

Latest