- సంచలన కథనాలకు కేరాఫ్ మహా తెలుగు దినపత్రిక
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
- మహా 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
వరంగల్ హన్మకొండ మహా;
సంచలన కథనాలతో అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న మహా తెలుగు దినపత్రిక వారి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చేతుల మీదుగా మహా పత్రిక వరంగల్ ప్రతినిధి ఈద శ్రీనాథ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. మహా తెలుగు దినపత్రిక మీడియా రంగంలో ఒక కొత్త ఒరవడి తో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందుంచి కొత్త ట్రెండు ను సృష్టించిందన్నారు.
మహా తెలుగు దినపత్రిక తో పాటు ఏఎన్ఎన్ చానల్ ప్రజలను మేలుకొలిపే విధంగా మరింత మంచి కథనాలతో దినదినాభివృద్ధి చెందాలని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహా పత్రిక పాఠకులకు యజమాన్యానికి, పత్రికా ప్రతినిధులకు వరంగల్ జిల్లా ప్రజలకు భోగి, మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ ఎండి అయూబ్ అలీ, డిఆర్ఓ ఎం విజయలక్ష్మి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.








