- రాష్ట్రానికి దేశానికి రైతు వెన్నుముక్క: ఎమ్మెల్యే రంగారెడ్డి
- రైతులకు అధునాతన వ్యవసాయ యంత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే…
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నంలో రైతులకు అధునాతన వ్యవసాయ యంత్రాలను, ఎమ్మెల్యే రంగారెడ్డి పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పరికరాలు సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, నియోజకవర్గ రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, జిల్లా సహాయ వ్యవసాయ అధికారి పద్మజ, చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రానికి దేశానికి రైతు వెన్నుముక్క అని, రైతులకు అధునాతన వ్యవసాయ యంత్రాలను, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే రంగారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు పెద్దపీట వేయడం జరిగిందని, ఇప్పటికే రైతు రుణమాఫీ, సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ అందించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, ఎదుళ్ళ పాండురంగారెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి విద్యాదరి, ఈసీ శేఖర్ గౌడ్, ముత్యాల రాజశేఖర్ రావు, ఏఎంసి డైరెక్టర్లు రాజు, భాస్కరాచారి, మస్కు నరసింహ, శ్రీశైలం (రామారావు), తాళ మహేష్ గౌడ్, ఇతర వ్యవసాయ అధికారులు, రైతులు పలువురు పాల్గొన్నారు.








