- కాంగ్రెస్ పార్టీలోకి కవిత
- స్పష్టత ఇచ్చిన టీపీసీసీ చీఫ్
- మేడారంలో కేబినెట్ సమావేశంపై హర్షం వ్యక్తం చేసిన మహేష్ కుమార్ గౌడ్
- దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదని బీజేపీకి చురక
- మునిసిపాలిటీలన్నీమావేనని ధీమా
హైదరాబాద్, మహా : తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం స్పందించారు. మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఆదరించబోరని అన్నారు. కవిత చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పడం లేదంటే ఖచ్చితగా అవినీతి జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారని, ఆలాంటి పార్టీని ప్రజలు ఆధరించబోరన్నారు. బీజేపీ నేతలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని, దేవుళ్ల పేరుతో రాజకీయంతోనే ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారని మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. మేమూ హిందులమే, కాంగ్రెస్ లో దాదాపు 90 శాతం మంది హిందువులే ఉన్నారు, వారంతా దేవుడిని పూజిస్తున్నారన్నారు. న్నికల సమయంలో దేవుడి పేరుతో రాజకీయం చేయడం తప్ప దేశ హితం గురించి కానీ, ప్రజల అవసరాలను కానీ బీజేపీకి ఎప్పుడూ గుర్తించలేదని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ఈ సారి మేడారంలో నిర్వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పాలన ఎప్పుడూ కేంద్రీకృతం కారాదని మంత్రులు, మంత్రివర్గం గ్రామాలకూ, మారుమూల ప్రాంతాలకూ వెళ్ళాలన్న సంకల్పానికి నాంది పలికినట్లని వ్యాఖ్యానించారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించడం ఖాయమని, సర్పంచ్ ఎన్నికల ఫలితాలకు మించిన ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో ఉండబోతుందన్నారు. గ్రామాలను పట్టణాలను సరిసమానంగా అభివృద్ధి చేస్తున్నామని, దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కానన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాళవో అమలవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ కు తెలంగాణలో ఇక చోటు లేదని, మునిసిపల్ ఎన్నికల్లో మరోసారి ఇది రుడువు కోబోతుందన్నారు.








