- గమ్యం గమనం చేరకుండానే…
- రోడ్డు ప్రమాదాలలో యువతీ యువకులు చనిపోవడం ఆందోళనకరం
- ఉప్పల్ జోన్ డిసిపి సురేష్ కుమార్.
కుషాయిగూడ, మహా : గమ్యం గమనం లేకుండానే రోడ్డు ప్రమాదాలలో 30 సంవత్సరాల వయసు గల యువతి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని, భవిష్యత్ తరాలకు ఇది పెద్ద నష్టదాయకమని, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని ఉప్పల్ జోన్ డిసిపి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు మంగళవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆవరణలో రోడ్డు వారోత్సవాలు భద్రతపై సెమినార్ ను కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన డిసిపి సురేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు ప్రతి ఏటా రోడ్డు యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని పెరిగిపోతున్న కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ప్రయాణం చేసేటప్పుడు వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్లు సీట్ బెల్టులు ధరించాలని అజాగ్రత్తగా వాహనాలను నడిపినట్లయితే ప్రమాద అంచున కొన్ని తెచ్చుకున్నట్లేనని నిర్లక్ష్యం విడనాడి జాగ్రత్తగా డ్రైవింగ్ ను యధావిధిగా కొనసాగించినట్లయితే ప్రమాదాల బారిన పడకుండా గమ్యం గమనం చేరిపోతామని సురేష్ కుమార్ అన్నారు కుషాయిగూడ డివిజన్ ఏసిపి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ హెల్మెట్ ధరించు వాహనాన్ని నడపాలని నిర్లక్ష్యం విడనాడి గమ్యం ఘమనానికి చేరుకోవాలంటే నీ ప్రాణంపై జాగ్రత్త వహించాలని ఆయన పలు సూచనలు చేసినారు రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురి అవుతున్నారని ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలలో చైతన్య స్ఫూర్తిని తీసుకురావాల్సిన అవసరము ఎంతైనా ఉందని ప్రజలు స్వచ్ఛందంగా కదిలి రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని వెంకటరెడ్డి సూచించారు ఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి మాట్లాడుతూ కుషాయిగూడ పోలీసులు ప్రజల పట్ల మంచిగా మెదులుతున్నారని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడంపై పావని మణిపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ప్రతి కాలనీలో రోడ్డు ప్రమాదాలు భద్రతపై వారోత్సవాలు నిర్వహించాలని ప్రతి కాలనీ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సెమినార్ లో కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్లు వెంకన్న నిమ్మ సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ ట్రాఫిక్ పోలీసులు స్వచ్ఛంద సేవా సంస్థలు నేతలు అనురాధ టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి షేర్ మణెమ్మ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవరెడ్డి బి ఎం ఎస్ నాయకులు ప్రభాకర్ అనురాధ సఖి స్వచ్ఛంద సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి సాయిబాబా నగర్ కాలనీకి చెందిన వరలక్ష్మి బోజస్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.







