హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన 7వ అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి ఈనెల 15 వరకు నిర్వహించే ఫెస్టివల్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ మిఠాయిలు, తెలంగాణ పిండి వంటలతో కూడిన 60 స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. 120 హ్యాండ్లూమ్, హ్యాండీ క్రాఫ్ట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 15 రాష్ట్రాల నుంచి 55 దేశవాళీ కైట్ క్లబ్‌ల సభ్యులు పాల్గొన్నారు. ఫెస్టివల్లో వీక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఈనెల 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది.
Post Views: 22







