ఆదిలాబాద్ మహా : ప్రజల సమస్యలపై గళమెత్తుతూ వాటి పరిష్కారం కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ , మహా దిన పత్రిక పని చేస్తున్నాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవాభవన్ లో ఏఎన్ఎన్ ఛానల్ మహా పత్రికల నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు.మంచి విలువలతో కూడిన జర్నలిజంతో ప్రజా పక్షాన నిలిచి మరింత ప్రజాదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఏఎన్ఎన్ ఛానల్ , మహా పత్రిక సిబ్బందికి అభినందనలు తెలియ చేస్తూ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్పిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కొండ గంగాధర్, లోక ప్రవీణ్ రెడ్డి, శాంతన్ రావు, మంచికట్ల ఆశమ్మ,శ్రీలేఖ,సందానర్సింగ్, మునిగెల విఠల్, అల్చెట్టి నాగన్న, బూర్ల శంకరయ్య,రఫీక్ , షకీల్ తదితరులు పాల్గొన్నారు.







