ఆదిలాబాద్ మహా: తెలుగువారి సంస్కృతిలో సంక్రాంతి పండగ విశిష్టమైనదని, పండగ ద్వారా వాతావరణంలో వచ్చే మార్పులను గమనిస్తూ ప్రకృతిని ఆస్వాదించే తీరును పలువురు కవులు, రచయితలు, కళాకారులు తెలిపారు. మకరసంక్రాంతి సందర్భంగా గురువారం నిర్మల భారతి సాహిత్య కళా సాంస్కృతిక సామాజిక సేవా క్షేత్రం, నిర్మల్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీయు సంఘ భవనంలో సంక్రాంతి వైభవం అంశంపై జిల్లా స్థాయి సంక్రాంతి కవిసమ్మేళనం నిర్వహించారు. నిర్మల్ జిల్లా కవులు ,కళాకారులు కార్యక్రమంలో పాల్గొని తమ కవితలు, పాటలద్వారా పండగ యొక్క ఔన్నత్యాన్ని, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, పండగకు ప్రకృతికి మధ్య గల సంబంధాన్ని తెలియజేశారు.అనంతరం కవులను, గాయకులను నిర్మల భారతి ఆధర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో నిర్మలభారతి అధ్యక్ష్య ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి పరమేశ్వర్, డా. బి వెంకట్, సంయుక్త కార్యదర్శులు – అంబటి నారాయణ,యార సాయినాథ్ రెడ్డి, తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు నేరెళ్ల హనుమంతు, కవులు డా.దామెర రాములు, డా.మురళీధర్, డా.కృష్ణంరాజు, డా వేముగోపాలకృష్ణ, చట్ల గజ్జారామ్, పోలీస్ భీమేశ్, పాటే మా ప్రాణం సంగీత అకాడమీ డైరెక్టర్ చెనిగారం నాగరాజు,వెన్నెల డాన్స్ అకాడమీ డైరెక్టర్ ధనరాజ్,గాయకురాలు సాయిప్రియ,కవియాత్ర చైర్మన్ కారం నివేదిత, కలం స్నేహం జిల్లా అధ్యక్షురాలు దేవిప్రియ,కారం ప్రణతి,భిక్షపతి నాయక్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








