- మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు…
- బీసీలకు 38 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం
- గతంలో కంటే భిన్నంగా రిజర్వేషన్లు
- జిల్లాలో ఐదు చైర్మన్ స్థానాలకు జనరల్
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే క్రమంలో, ఈరోజు శనివారం 121 మున్సిపాలిటీలకు, వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేసింది.
జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు….
రంగారెడ్డి జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, అందులో ఐదు మున్సిపాలిటీలు జనరల్ స్థానాన్ని కేటాయించగా, ఒక స్థానం బీసీకి, మరొక స్థానం ఒక ఎస్సీకి కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం, శంకర్ పల్లి, కొత్తూరు, చేవెళ్ల, ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ జనరల్ స్థానానికి కేటాయిస్తూ… షాద్నగర్ మున్సిపాలిటీ చైర్మన్ బిసి స్థానానికి, మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ స్థానానికి ఎస్సీ రిజర్వేషన్లను కేటాయిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
రాష్ట్రంలో 121 మున్సిపాలిటీల్లో 38 స్థానాలు(31.4%) బీసీలకు కేటాయిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది. తెలంగాణలో మొత్తం 121 మున్సిపాలిటీల్లో 38 బీసీలకు, 17 ఎస్సీలకు, 5 ఎస్టీలకు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
గతంలో ఉన్న రిజర్వేషన్లకు భిన్నంగా రావడం జరిగిందని పలువురు తెలపడం జరిగింది.








