Mahaa Daily Exclusive

  జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వార్డులో ఎమ్మెల్యే పర్యటన…

Share

 

నాగర్‌కర్నూల్ జిల్లా మహా: కేంద్రంలోని 9వ వార్డులో మన ప్రియతమ నేత, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని పలు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వార్డులోని పర్యటించి, ఇటీవల పూర్తయిన నూతన రహదారులు మరియు డ్రైనేజీ పనులను పరిశీలించారు.
అనంతరం రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతిన్న పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే తక్షణమే రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.