Mahaa Daily Exclusive

  రేపు ఆసిఫాబాద్ జిల్లాకు మంత్రి జూపల్లి

Share

 

ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ఎక్సైజ్, పర్యాటకం, సంస్కృతి మరియు పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు.
కాగజ్ నగర్ పట్టణం యల్లగౌడ్ తోటలోనీ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆర్ ఆర్ ఓ కాలనీలోని కేజీబీవీల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుండి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.