- మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు
- విధుల్లో 42 వేల మంది సిబ్బంది
- 1418 ఎకరాల్లో పార్కింగ్
ములుగు, మహా : ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు సర్వం సిద్ధమయ్యాయి. ఈసారి 3 కోట్ల మంది భక్తులు రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తోంది. రాకపోకల నుంచి దర్శనం వరకు భక్తులకు ఇబ్బందులు రాకుండా చూసే దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది. మేడారం మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈసారి 2026 జనవరి 28 నుండి జనవరి 31 వరకు జరగనుంది. జనవరి 28న సారలమ్మ, జనవరి 29న సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. జనవరి 30న భక్తులు మొక్కులు చెల్లించి, జనవరి 31న దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అయితే జాతర ప్రారంభానికి ముందే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మేడారం వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి.
మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు – ముఖ్య విషయాలు
మేడారం జాతర కోసం మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 2 వేల మంది ఆదివాసీ వాలంటీర్లు విధుల్లో ఉంటారు. 27 శాశ్వత, 33 తాత్కాలిక మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశారు. 1418 ఎకరాల్లో 42 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. 4 వేల ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి.10,441 మంది ఆర్టీసీ సిబ్బంది విధుల్లో ఉంటారు. 5,482 తాగు నీటి పాయింట్లు ఉంటాయి. జంపన్న వాగు వద్ద 119 డ్రెసింగ్ రూమ్స్ ఏర్పాటు. 5,700 టాయిలెట్స్ ఏర్పాటు చేయగా 5 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉంటారు. 196 ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయగా 911 స్తంబాలను అత్యవసర సమయంలో వినియోగించేందుకు అందుబాటులో ఉంచారు. 5,192 మెడికల్ సిబ్బంది విధుల్లో ఉంటారు.
మేడారం జాతర కవరేజీ కోసం అడ్వాన్స్ మీడియా సెంటర్ ను ఏర్పాటు చేశారు.








