Mahaa Daily Exclusive

  వెంకటాపురం ఏరియా ఆసుపత్రిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి: రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ

Share

వెంకటాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మహానేత నందమూరి తారక రామారావు 30వ వర్థంతి సందర్భంగా మండల పార్టీ నాయకులు సేవాభావంతో ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారు ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన మహానేత అని గుర్తుచేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేయడమే నిజమైన నివాళి అని తెలిపారు.
పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పట్టాభి లక్ష్మణరావు, నల్లూరి వెంకన్న, శ్రీను పాల్గొన్నారు. అలాగే మిగతా మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
రోగులు ఈ సేవా కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.