రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులైన టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్ కాంగ్రెస్ లో పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజా భవన్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై, పార్టీలో చేరినట్లు రవీందర్ వెల్లడించారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రెండు వందల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, రాష్ట్రంలోని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, సర్వే ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ జడ్పిటిసి భూపతి గల్ల మహిపాల్, రాష్ట్ర నాయకులు ఈసీ చంద్రశేఖర్ గౌడ్, ముత్యాల రాజశేఖర్, ప్రశాంత్, మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ఆనంద్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జెర్కొని బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.








