- మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు
- ఎక్కడ ఏ మంత్రి ఇన్‌ఛార్జి?
హైదరాబాద్, మహా : పురపాలికలకు పాలకవర్గాల కోసం త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జులుగా మంత్రులను నియమించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జులను నియమించారు. మంగళవారం నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలు మెుదలుపెట్టాలన్నారు. 15 నియోజకవర్గాలకు 15 మందిని ఇన్‌ఛార్జులుగా నియమించింది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. త్వరలో ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరి మెుదటి వారం లేదంటే.. రెండో వారంలో ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోంది.
ఇన్‌ఛార్జిల జాబితా…..
మల్కాజిగిరి-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
చేవెళ్ల-దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఖమ్మం-కొండా సురేఖ
మహబూబాబాద్-పొన్నం ప్రభాకర్
మహబూబ్‌నగర్-దామోదర రాజనరసింహ
నాగర్‌కర్నూల్-వాకిటి శ్రీహరి
జహీరాబాద్-అజారుద్దీన్
మెదక్-వివేక్ వెంకటస్వామి
నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్ కుమార్
భువనగిరి-సీతక్క
నిజామాబాద్-ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీంనగర్-తుమ్మల నాగేశ్వరరావు
వరంగల్-పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పెద్దపల్లి-జూపల్లి కృష్ణారావు
ఆదిలాబాద్-ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి








