Mahaa Daily Exclusive

  మెడికల్ హబ్‌గా జగిత్యాల: రూ.235 కోట్లతో 450 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన

Share

  • మెడికల్ హబ్ గా జగిత్యాల జిల్లా..
  • మెడికల్ కాలేజ్ పనులు త్వరగా
    పూర్తి అయ్యేలా చూస్తా..
  • అన్ని సౌకర్యాలు హంగులు అద్భుతంగా నిర్మించేలా కృషి చేస్తా..
  • రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల లో రూ. 235 కోట్లతో 450 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన. క్రిటికల్ కేర్ భవనం ప్రారంభోత్సవం

కరీంనగర్ మహా : అన్ని రకాల అధునాతన వైద్య సేవలు మెడికల్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్, మెడిసిన్ స్టోర్, 450 పడకల ఆస్పత్రి ఏర్పాటుతో జగిత్యాల జిల్లా మెడికల్ హబ్ గా మారనుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.

జగిత్యాల లో మంగళవారం రూ. 235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల ఆస్పత్రి భవనం పనులకు శంకుస్థాపనతో పాటు క్రిటికల్ కేర్ భవనాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి మంగళవారం ప్రారంభించారు

ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కళాశాల దగ్గర రూ. 235 కోట్లతో 450 పడకల ఆస్పత్రిని నిర్మించుకోబోతున్నామన్నారు. అలాగే రూ. 23.5 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్, రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ప్రారంభించామని తెలిపారు. జగిత్యాల జిల్లా ప్రజలతో పాటు చుట్టు పక్క జిల్లాలకు చెందిన ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుందని అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి క్రిటికల్ కేర్ ఏర్పాటుతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. క్రిటికల్ కేర్, నూతన ఆస్పత్రి జిల్లాలోని 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుం దన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో జిల్లా కేంద్రంలో విద్య, వైద్యానికి అత్యధిక నిధులు మంజూరయ్యాయని తెలిపారు. క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో డయాలసిస్, అత్యవసర ప్రసూతి శస్త్ర చికిత్సలు, మూడు ఆపరే షన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. జగిత్యాల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానని, జగిత్యాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ నాలుగు వైపుల రహదారి తో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 450 పడకల ఆసుపత్రి జగిత్యాల లో నిర్మాణం క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల వల్ల రోడ్డు ప్రమాద బాధితులు అత్యవసర ప్రసూతి బాధితులకు చాలా ప్రయోజనకరంగా తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చొరవతో 40కోట్ల నిధులు మంజూరు తో మెడికల్ కాలేజీ పనులు త్వరిత గతిన జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్యానికి కావలసిన అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మెడికల్ ప్రిన్సిపాల్ సునీల్ కుమార్, డి.ఎం.ఎచ్.వో సుజాత, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.