Mahaa Daily Exclusive

  కర్రెగుట్టల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ప్రారంభం

Share

తెలంగాణ, మహా : మావోయిస్టులకు కంచుకోటగా మారిన కర్రె గుట్టలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వాజేడు మండలం మురుమూరు గ్రామం నుంచి సుమారు 15 కిలోమీటర్ల గుట్టలు, లోయలను చదును చేస్తూ కర్రెగుట్టల్లోని పామునూర్‌‌‌‌ గ్రామం వద్దకు రహదారి నిర్మించారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్‌‌‌‌ బేస్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ను సౌత్‌‌‌‌ సెక్టార్‌‌‌‌ ఐజీ విక్రమ్‌‌‌‌ ప్రారంభించారు. కర్రెగుట్టలో బేస్‌‌‌‌క్యాంప్‌‌‌‌ను ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణ – ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రాల సరిహద్దులోని కర్రెగుట్టలపై ఏర్పాటు చేసిన మొదటి బేస్ క్యాంపు ఇదేనని ఐజీ విక్రమ్‌‌‌‌ తెలిపారు.