Mahaa Daily Exclusive

  గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల దృష్ట్యా కాంప్లెక్స్ సమావేశాలను రీషెడ్యూల్ చేయాలి: విద్యాశాఖకు టీపీటీఎఫ్ (TPTF) వినతి

Share

ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాలను రీ షెడ్యూల్ చేయాలి
కుషాయిగూడ, మహా: ప్రాథమిక పాఠశాలల జనవరి నెల కాంప్లెక్స్ సమావేశాలను రీ షెడ్యూల్ చేయాలని టిపిటిఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గాడిపల్లి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల జనవరి నెల కు సంబంధించి కాంప్లెక్స్ సమావేశాలను ఈనెల 23 నుండి నిర్వహించుటకు పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశించడం జరిగిందని కానీ ఈనెల 26వ తేదీన నిర్వహించుకోబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుందని ఈ సమయంలో కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం ఉపాధ్యాయులకు ఇబ్బందిగా ఉంటుందని అందువల్ల ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాలను గణతంత్ర దినోత్సవం తర్వాత రీ షెడ్యూల్ చేయాలని అన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు.