- కవిత కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారు
- నేనే అడ్డుకుంటున్నా : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, మహా : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. కవిత పార్టీ మార్పు అంశంపై కీలక విషయాలు వెల్లడించారు. కవిత మా పార్టీలో చేరుతానని అంటున్నారు. ఆమె వైపు నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారని, అందుకే ఆమె చేరికను తానే వద్దంటున్నానని , కవితను చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎంతోమంది శక్తివంతులైన, సమర్థవంతమైన నాయకులు ఉన్నారని.. కవిత కంటే మెరుగైన నాయకత్వం తమ వద్ద ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని చేర్చుకుని పార్టీ ప్రతిష్టను దెబ్బతీసుకోమన్నారు. కవిత చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని, స్వంత కుటుంబసభ్యులే ఆమెకు అన్యాయం చేశారన్నారు. అయితే ీ మాట తాను అనడం లేదని, కవితే అనేక సందర్భాలలో తనకు బావ హరీష్ రావు, సోదరుడు కేటీఆర్, మరో సోదరుడు సంతోష్ రావులతో జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారన్నారు. తనకు జరిగిన మోసాన్ని, అన్యాయాన్ని స్వయంగా మండలిలోనే మాట్లాడారన్నారు.








