Mahaa Daily Exclusive

  సిట్ విచారణపై మన్నె గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం..

Share

  • సిట్ విచారణపై
    మన్నె గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం
  • అరెస్ట్ చేసిన పోలీసులు, ఉద్రిక్తత

హైదరాబాద్, మహా

తెలంగాణ లో పోలీసుల రాజ్యం నడుస్తోందని, ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ పైన కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కేటీఆర్ కి మద్దతుగా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేసి మలక్ పేట పిఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. గోవర్ధన్ అరెస్ట్ ను బీఆర్ఎస్ శ్రేణులు ఖండించాయి.