Mahaa Daily Exclusive

  నా కుమారుడు, చిరంజీవి అందుకే వచ్చారు: దావోస్ పర్యటన విమర్శలపై మంత్రి పొంగులేటి ఘాటు స్పందన

Share

  • నా కొడుకు, చిరంజీవి అందుకే వచ్చారు
  • భూభారతిలో రూ 3.9కోట్ల రిజిస్ట్రేషన్ టాక్స్ అక్రమాలు
  • ధరణి అక్రమాలపై సిద్దిపేట, సిరిసిల్లలో ఆడిట్
  • చిట్ చాట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, మహా : దావోస్ ప‌ర్య‌ట‌న‌కు త‌న కొడుకు రావ‌డంపై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. చిట్ చాట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న కుమారుడు బిజినెస్ ప‌నిమీద‌నే దావోస్ వ‌చ్చార‌ని చెప్పారు. త‌న కుమారుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకోస‌మే వ‌చ్చార‌న్నారు. వాళ్లిద్ద‌రికి ప్ర‌భుత్వం ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌లేద‌ని అన్నారు. త‌న కుమారుడిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, త‌న‌పై భూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారని అన్నారు. ఈడీ కేసుల గురించి మాట్లాడ‌టం త‌ప్ప మ‌రొక‌టి ఏం లేద‌న్నారు. తాను ఎలాంటి క‌బ్జాల‌కు పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. భూభార‌తిలో రూ.3.9 కోట్ల రిజిస్ట్రేష‌న్ టాక్స్ అక్ర‌మాలు జ‌రిగాయ‌న్నారు. ప్ర‌తి మండ‌లాన్ని యూనిట్ గా తీసుకుని కేసులు న‌మోదు చేశామ‌ని చెప్పారు. ధరణి అక్రమాలపై సిద్దిపేట, సిరిసిల్లలో కేరళ సంస్థ ఆడిట్ చేస్తోందని అన్నారు. నైని కోల్ మైన్స్ టెండ‌ర్లు రాక‌ముందే అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అంతే కాకుండా ఫోన్ ట్యాపింగ్ లో ఎవ‌రు ఉన్నా విచార‌ణ‌కు రావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.