Mahaa Daily Exclusive

  భారత రాజ్యాంగంలో.. ఓటు హక్కు విలువైనది…

Share

  • భారత రాజ్యాంగంలో.. ఓటు హక్కు విలువైనది….
  • దేశంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు
  • యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
  • ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి…

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు కల్పించడం జరిగిందని, ఓటును వినియోగించుకోవడం పౌరుడు హక్కు అని ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి అన్నారు.

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి అనంతరెడ్డి ఆధ్వర్యంలో, 16వ జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆనంద్ రెడ్డి, ఎమ్మార్వో సునీత రెడ్డితో కలిసి, ఖానాపూర్ లోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం నుంచి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఓటు హక్కు పై ఉద్యోగులు, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డిఓ మాట్లాడుతూ దేశంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు, ఓటు హక్కు ద్వారా ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం వెంటనే అధికారం చేపడుతోందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగం మరో దేశానికి లేదని గుర్తు చేశారు. ఈ తరుణంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.