Mahaa Daily Exclusive

  పలువురు డీఎస్పీల బదిలీలు .. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

Share

హైదరాబాద్, మహా ‌ : తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏసీపీ, డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న ఎల్‌.ఆదినారాయణను కొత్తగూడెంకు డీఎస్పీగా బదిలీ చేశారు. ఇక్కడ డీఎస్పీగా పనిచేస్తున్న అబ్దుల్ రహ్మన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌ సీటీసీలో ఏసీపీగా పనిచేస్తున్న డీవీ. ప్రదీఫ్ కుమార్‌రెడ్డిని ఆదిబట్ల ఏసీపీగా బదిలీ చేశారు. సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.ఆదిమూర్తిని మియాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా , మల్కాజిగిరిలో ఏసీపీగా పనిచేస్తున్న ఎస్‌.చక్రపాణిని జవహర్‌నగర్‌ ఏసీపీగా, నగరంలో ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న మోహన్‌ కుమార్‌ను మేడిపల్లి ఏసీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌లో ఏసీపీగా ఉన్న బి. రవీందర్‌ను భువనగిరి డీఎస్పీగా, యాంటి నార్కోటిక్‌ బ్యూరోలో డీఎస్పీగా ఉన్న సీహెచ్‌ శ్రీదర్‌ను మహాంకాళి ఏసీపీగా, టీజీపీఏలో డీఎస్పీగా పనిచేస్తున్న సారంగాపాణిని ఎల్దెండు డీఎస్పీగా ఇక్కడ డీఎస్పీగా పనిచేస్తున్న ఎన్‌. చంద్రబానును హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.