- భాజపాను ఓడించడం కాంగ్రెస్ కే సాధ్యం
- టికెట్లు దక్కని వారికి నామినేటెడ్ పదవులు: మంత్రి ఉత్తమ్
కోరుట్ల, మహా : అన్ని మతాల సమ్మేళనమే కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో భాజపాను ఓడించాలంటే తమ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్ నాయకుల, కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి టికెట్లు దక్కని వారు అధైర్య పడొద్దని.. వారికి నామినేట్ పదవులు ఇస్తామన్నారు. సన్నబియ్యం కోసం ఏటా రూ.13,600 కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో మున్సిపల్ షెడ్యూల్ విడుదల అవుతుందని, ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.
Post Views: 7








