Mahaa Daily Exclusive

  చర్లపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

Share

 

చర్లపల్లి, మహా : ఖైదీలు నేర ప్రవృత్తి నుంచి సత్ప్రవర్తనతో మారి తమ తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం జైలు సూపర్ సూపరిండెంట్ భరత్ పిలుపునిచ్చారు. సోమవారం చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఖైదీలను ఉద్దేశించి సూపరిండెంట్ భరత్ మాట్లాడుతూ ఖైదీలు నేరం నుండి మానుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని హితావు పలికారు. భవిష్యత్తులో అభివృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. జైళ్ళ శాఖలో ఉన్నతమైన ప్రతిభ చూపి అవార్డుకు ఎంపికైన అసిస్టెంట్ డిప్యూటీ జైలర్ అశోక్ కుమార్, ఫార్మసిస్ట్ శ్రీరాములు హెడ్వార్డర్ ఇనాయతుల, స్వీపర్ ను జైలు సూపరిండెంట్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జైలర్ ఆర్.శ్రీనివాస్, డిప్యూటీ జైలర్ కరీం, డాక్టర్ నాజ్, డాక్టర్ అరుణ కుమారి, డాక్టర్ జనార్దన్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.