Mahaa Daily Exclusive

  28 నుంచి పార్లమెంట్ సమావేశాలు… నేడు అఖిలపక్ష భేటీ….

Share

 

న్యూఢిల్లీ, మహా: ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం వారం అఖిలపక్ష భేటీని నిర్వహిస్తోంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆహ్వానం పంపారు. పార్లమెంట్ సమావేశాల్లో సహకరించాలని, అలాగే ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను విపక్షాలకు అందించాలని కేంద్రం కోరనుంది. ఈ సమావేశాలు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి.