Mahaa Daily Exclusive

  ఈ ఏడాదిలోనే భారత్-ఈయూ ఎఫ్ టీఏ అమల్లోకి – కేంద్రమంత్రి పీయూష్ గోయెల్​

Share

ఢిల్లీ, మహా
భారత్ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ చారిత్రక ట్రేడ్ డీల్ 2026 సంవత్సరంలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. భారత్, యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాల కూటమి మధ్య ఒప్పందం ఖరారైనందున, తదుపరిగా శరవేగంగా చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడంపై ఫోకస్ పెడతామన్నారు. ఈ ఒప్పందం అమలుకు సంబంధించిన వేడుకలను కూడా ఈ ఏడాదే జరుపుకుంటామనే ఆశాభావాన్ని పీయూష్ గోయల్ వ్యక్తం చేశారు. ప్రతీ ఒప్పందం దేనికది ప్రత్యేకమైందని, ఈ ట్రేడ్ డీల్ మాత్రం అద్భుతమైందని ఆయన కొనియాడారు.