Mahaa Daily Exclusive

  మహారాష్ట్రలో విమాన ప్రమాదం .. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం..

Share

 

మహా : మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి.

Latest