Mahaa Daily Exclusive

  ఖానాపూర్ లో బీఆర్ ఎస్ కు షాక్…..

Share

  • ఖానాపూర్ లో బీఆర్ ఎస్ కు షాక్
  • కాంగ్రెస్ లోకి భారీ చేరిక‌లు
  • మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ జ‌హీర్ రంజానీ , ముజాహిదీన్ ఆధ్వ‌ర్యంలో చేరిక‌లు
  • పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత‌లు ప‌ర్వేజ్, అన్సార్
  • కండువాలు క‌ప్పి స్వాగ‌తించిన కంది శ్రీ‌నివాస రెడ్డి
  • ఆదిలాబాద్ బ‌ల్దియా గెల‌వ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని పిలుపు

ఆదిలాబాద్ మ‌హా : మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 40 స్థానాలు గెలిచి ఆదిలాబాద్ బ‌ల్దియా పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగ‌రేయాల‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి పిలుపునిచ్చారు.మంగ‌ళ‌వారం రాత్రి ప‌ట్ట‌ణంలోని 32వ వార్డు ఖానాపూర్ కాల‌నీలో జ‌రిగిన భారీ చేరిక‌ల స‌భ‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.స్థానిక కాంగ్రెస్ శ్రేణ‌లు , కాల‌నీ వాసులు బాణ‌సంచా కాల్చి ,గుస్సాడీ నృత్యాలు ఏర్పాటు చేసి పూలు చ‌ల్లుతూ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.స‌భా వేదిక వ‌ర‌కు గుర్రం స‌వారి ఎక్కించి ఊరేగింపుగా తీసుకెళ్లారు.దారిపొడ‌వునా కేరింత‌ల‌తో నృత్యాలు చేస్తూ భారీ గ‌జ‌మాల‌తో స్వాగ‌తం ప‌లికి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు.రాత్రివేళ‌లోనూ ఇసుకేస్తే రాల‌నంత జ‌నం స‌భ‌కు హాజ‌ర‌య్యారు.మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ జ‌హీర్ రంజానీ , ముజాహిదీన్ ఆధ్వ‌ర్యంలో పెద్ద సంఖ్య‌లో కాలనీ వాసులు కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారంద‌రికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ వార్డు నుండి తండ్రీ కొడుకులు ప‌ర్వేజ్, అన్సార్ ఇద్ద‌రు బీఆర్ ఎస్ కీల‌క నేత‌లు కాంగ్రెస్ లో చేర‌డంతో ఇక ఇక్క‌డ బీఆర్ఎస్ ద్వారాలు మూసుకుపోయాయ‌న్నారు.ఇక బీజేపీ తోనే పోటీ అని ఆ పార్టీని సింగ‌ల్ డిజిట్ కే ప‌రిమితం చేయాల‌ని ఆయ‌న శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ పేద‌ల పార్టీ అని అంద‌రూ ఆశీర్వ‌దిస్తే అనుకున్న‌ట్టు 40 వార్డులు తెలిచితీరుతామ‌న్నారు.ప్ర‌భుత్వం పేద‌ల నుద్దేశించి అనేక సంక్షేమ‌ప‌థ‌కాలు అందిస్తుంద‌ని వారంద‌రూ త‌మ ఓట్ల‌తో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్దుల‌ను ఆశీర్వ‌దించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌న్నారు. ఇక ఆదిలాబాద్ పుర‌పాల‌క పీఠ‌మే ల‌క్ష్యంగా మున్సిప‌ల్ ప‌రిధిలోని ప్ర‌తీ కాంగ్రెస్ నాయ‌కుడు, కార్య‌క‌ర్త‌. అభిమాని క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌న్నారు. స‌ర్వేలో ఎవ‌రికి టికెట్ వ‌చ్చినా పార్టీ గెలుపు కోసం క‌లిసిట‌క‌ట్ఉగా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.ఆదిలాబాద్ మున్సిప‌ల్ పై కాంగ్రెస్ జెండా ఎగ‌రేసి మున్సిప‌ల్ ఎన్నిక‌ల పార్ల‌మెంట్ ఇంచార్జి సుద‌ర్శ‌న్ రెడ్డికి, జిల్లా ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావుకు , సీయం రేవంత్ రెడ్డిల‌కు కానుక‌గా ఇవ్వాల‌న్నారు.ఎన్నిక‌ల‌కు ముగిసేంత‌వ‌ర‌కు విశ్ర‌మించ‌కుండా పార్టీ గెలుపే ల‌క్ష్యంగా బాధ్య‌త‌గా ప‌నిచేయాల‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆత్మ చైర్మ‌న్ గిమ్మ సంతోష్, ముడుపు దామోద‌ర్ రెడ్డి, శాంత‌న్ రావు, గుడిప‌ల్లి న‌గేష్, ఎంఏ ష‌కీల్, ర‌షీద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest