- నల్గొండ ‘కార్పొరేషన్’ పోరుకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు..
- మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేరు ను అధికారికంగా ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి..
- నలభై ఐదు వార్డులకు అభ్యర్థులను ప్రకటించిన మంత్రి…
నల్గొండ మహా: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తొలి విడతగా 45 వార్డులకు అభ్యర్థుల జాబితాను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం అధికారికంగా విడుదల చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నల్గొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు చేశారు.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డిల ఆమోదంతో ఈ జాబితాను రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. “నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చుకోవడం ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నం. సుమారు 2200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. నల్గొండను రాష్ట్రంలోనే నంబర్ వన్ ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వార్డుల వారీగా అభ్యర్థుల జాబితా
| వార్డు నెం. | అభ్యర్థి పేరు | రిజర్వేషన్ |
|—|—|—|
| 1 | అలకుంట్ల నాగరాజు (చిట్టి) | బి.సి. జనరల్ |
| 3 | గాలి వినోద (నాగరాజు) | ఎస్.సి. మహిళ |
| 4 | బోగరి సింధు (ఆనంద్) | ఎస్.సి. మహిళ |
| 5 | పున్న జ్ఞానేశ్వరి (గణేష్) | జనరల్ మహిళ |
| 6 | కర్నాటి సునంద కరుణాకర్ రెడ్డి | జనరల్ మహిళ
| 9 | అంగోతు ప్రదీప్ నాయక్ | ఎస్.టి. జనరల్ |
| 10 | చిన్నాల జానయ్య | జనరల్ |
| 12 | మామిడి కార్తీక్ | ఎస్.సి. జనరల్ |
| 16 | పెరిక స్వాతి (వినాయకరాజు చిట్టి) | ఎస్.సి. మహిళ |
| 21 | ఎం.డి. ఇబ్రహీం | జనరల్ |
| 32 | బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి | జనరల్ మహిళ |
| 34 | ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి | జనరల్ |
| 41 | కేసాని వేణుగోపాల్ రెడ్డి | జనరల్ |
| 44 | ఎం.డి. ఇర్ఫాన్ అహ్మద్ | బి.సి. జనరల్ |
| 48 | యామా కవిత దయాకర్ | జనరల్ మహిళ |








