లక్షెట్టిపేట,మహా,జనవరి 28:మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్య నాయకులను మలుపులు తిప్పుతున్నాయి.లక్షెట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎస్సీ జనరల్ కు కేటాయించడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,బిఆర్ఎస్ ల ఎత్తుగడలు ఊహలకు అందని విధంగా మారుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పలువురు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోగ,అనూహ్యంగా బిఆర్ఎస్ లక్షెట్టిపేట పట్టణాధ్యక్షుడు,మాజీ వైస్ ఎంపిపి పాదం శ్రీనివాస్,సీనియర్ నాయకులు,మాజీ కౌన్సిలర్ చాతరాజు రాజన్న,6 వ వార్డ్ అధ్యక్షుడు మనోహర్,ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కాంగ్రెస్ గూటికి చేరారు.
Post Views: 18








