- కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా తరలి వచ్చిన ఎమ్మెల్యే
పరిగి, మహా : వికారాబాద్ జిల్లా పరిగి మునిసిపాలిటీలోని 18 వార్డులకు రెండవ రోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. రెండవ రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు, నామినేషన్లు దాఖలు చేసిన వారిలో నాలుగవ వార్డు బిఅర్ఎస్ అభ్యర్థి శివనోళ్ళ చంద్రకళ, ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసుఫ్,12 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామకృష్ణ రెడ్డి, 17 వార్డు బిఅర్ఎస్ అభ్యర్థి ఎదిరే పద్మ, 13 వార్డు బిఅర్ఎస్ అభ్యర్థి మీర్ నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఒకటవ వార్డు నస్కల్ గ్రామానికి చెందిన కురువ అక్కమ్మ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు.
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
నామినేషన్ల ప్రక్రియ జోరందుకున్న నేపథ్యంలో నామినేషన్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తో కలిసి డీఎస్పీ శ్రీనివాస్, ఎంఅర్ఓ ఇతర అధికారులు పరిశీలించారు. నామినేషన్ దాఖలు కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు ఈ సందర్భంగా పరిశీలించారు.








