కుషాయిగూడ, మహా:
కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల కాళీ ప్రదేశం చెత్తాచెదారంతో నిండి కంపు కొడుతోంది. కొండనాలికకు మందు పెడితే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా మారింది జిహెచ్ఎంసి శానిటేషన్ విభాగం పనితీరు. మెయిన్ రోడ్డు, బహిరంగ ప్రదేశాల్లో ఇక్కడ చిత్త వేయరాదంటూ కల్లాపి చల్లి, ముగ్గులు వేసి చెత్త పడకుండా, బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..ఇంతవరకు బాగానే ఉంది. ప్రజలకు మంచి చెబితే పట్టదన్నట్టుగా.. తమ ఇళ్లలో చెత్తను కవర్లలో మూటలు కట్టి తీసుకొచ్చి ఖాళీ ప్రదేశాల్లో విసిరి వెళ్ళిపోతున్నారు. దీంతో కవర్లలో ఏదైనా తిను పదార్థాలు దొరుకుతాయేమోనని వీధి కుక్కలు కవర్లను చింపి నానా బీభత్సం చేస్తున్నాయి. అటుగా వెళ్లే మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. తప్పించుకోబోయి వాహనం దారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. చుట్టుపక్కల నివాసితులకు చెత్త కంపుతో దోమలు, ఈగలు దుర్వాసనతో రోగాల పాలవుతున్నారు. గుడికి, చిన్న తరహా పరిశ్రమలకు వెళ్లే మార్గం కావడంతో ఉదయాన్నే భక్తులు, అటుగా వెళ్లే పాదచారులు, బడి పిల్లలు, వాహనం దారులు ఆ చెత్త కంపులోంచే ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి.. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెయిన్ రోడ్ లే కాదు.. గల్లీలలో ఖాళీ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకునేలా.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికుల పక్షాన డివిజన్ భారతీయ జనతా పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తాళ్ల ఆనంద్ గౌడ్, రేగొండ వెంకటేశ్వర్లు, కొమ్ము నరసింహరావు, చిన్నంగాని దయానంద్, శ్రీకాంత్ వంశరాజ్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.








