- 4 న రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
- మహబూబ్ నగర్ జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరు
- భారీ బహిరంగసభకు బీజేపీ ఏర్పాట్లు
- ఎంవీఎస్ కళాశాల మైదానాన్ని పరిశీలించిన ఎంపీ డీకే అరుణ
- నబిన్ తొలి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ
మహబూబ్ నగర్, మహా : బీజేపీ జాతీయ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన 4 వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహబూబ్ నగర్ లో జరిగే పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానాన్ని ఎంపీ డీకే అరుణ శనివారం పరిశీలించారు. పోలింగ్ బూత్ కార్యకర్తల భేటీకి అన్ని రకాలుగా ఈ గ్రౌండ్ అనుకూలంగా ఉంటుందని ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎంపీ అరుణ తెలిపారు. ఉమ్మడి జిల్లాతోపాటు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నలుమూల నుంచి పార్టీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, బూత్ అధ్యక్షులు,మండల కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు,బీజేపీ వివిధ మోర్చ అధ్యక్షులు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఎంపీ కోరారు. .నితిన్ నబిన్ మార్గదర్శనం లో తెలంగాణ బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని, పార్టీ బలోపేతం కోసం బీజేపీ జాతీయ అధ్యక్షులు కార్యకర్తలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకుని.. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేద్దామని ఈ సందర్భంగా అరుణ పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున పుంజుకుంటుందని. యువత బీజేపీ వైపు చూస్తుందన్నారు. భవిష్యత్ లో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ తీసుకువచ్చేందుకు పని చేద్దామని అరుణ పిలుపునిచ్చారు. ఒక యువ నాయకుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ సిన్హా గారు పార్టీ శ్రేణుల్లో ఈ సమావేశం ద్వారా స్పూర్తి నింపనున్నారన్నారు.








