Mahaa Daily Exclusive

  రక్తదానం చేసి ప్రాణదాతలు కండి ` సర్పంచ్ గుగులోత్ వరలక్ష్మి రాజు…

Share

  • రక్తదానం చేసి ప్రాణదాతలు కండి ` సర్పంచ్ గుగులోత్ వరలక్ష్మి రాజు
  • ఉసిరికాయలపల్లిలో రక్తదానం శిబిరం ప్రారంభించిన సర్పంచ్

కారేపల్లి, మహా : ఆపదలో ఉన్న వారికి రక్తం ఇవ్వటం ద్వారా ప్రాణాలు కాపాడిన వారు అవుతారని కారేపల్లి మండల ఉసిరికాయలపల్లి సర్పంచ్ గుగులోత్ వరలక్ష్మిరాజు అన్నారు. ఆదివారం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ అవరణంలో తలసేమియావ్యాధి గ్రస్తులకు సర్పంచ్ వరలక్ష్మిరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈశిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధి గ్రస్తులకు నిత్యం రక్తం ఎక్కించటం అవసరమన్నారు. వారికి ఆరోగ్యవంతులైన వారు రక్తం దానం చేయటం ద్వారా వ్యాధిగ్రస్తుల జీవితాన్ని పెంచి ప్రాణదాతలు అవుతారన్నారు. ఉసిరికాయలపల్లి పంచాయతీలో అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ ప్రజల అభిష్టాం మేరకు ప్రజారంజక పాలన అందిస్తామన్నారు.