నిరాశ కలిగించే నిర్మలమ్మ 9వ బడ్జెట్
వంగూరి గంగిరెడ్డి.. షాద్ నగర్ విశ్రాంత ఉపాధ్యాయుడు..
షాద్ నగర్. మహా,
ప్రపంచ వ్యాప్త ఆర్ధిక అనిశ్చితి
ట్రంప్ అదనపు సుంకాలు
రూపాయి విలువ పతనం
ఉపాధి లేమి ధరల పెరుగుదల
అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే 9వ బడ్జెట్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తీరా చూస్తే బడ్జెట్ నిరాశ పరిచింది. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ లో పెద్దగా ప్రాధాన్యం లేదు. ముఖ్యంగా వేతనజీవులు విశ్రాంత ఉద్యోగులు ఆదాయపు పన్నులో స్టాండర్డ్ డిడక్షన్స్ పెంచకపోవడం పట్ల పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం 75వేలు ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ కనీసం లక్ష రూపాయలకైనా పెంచుతారనుకున్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగినా కూడా అదే కొనసాగించడం విడ్డూరం. క్యాన్సర్ మందుల పై పన్నులు తగ్గించడం వలన కొంత మానవత్వం చాటుకున్నారు.








