- నేటి నుంచే ఇంటర్ ప్రాక్టికల్స్
- సెంటర్లలో సీసీ కెమెరాలు
- ఈ నెల 25 నుంచి థియరీ పరీక్షలు
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అన్నీ ప్రాక్టికల్ కేంద్రాల్లో 6 నుంచి 8 సీసీ కెమెరాల చొప్పున ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఇందుకోసం ఇంటర్మీడియట్ బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
ప్రాక్టికల్ పరీక్షల కోసం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు సుమారు 3.40 లక్షల మంది హాజరవుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 6 నుంచి 8 సీసీ కెమెరాల చొప్పున ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించేలా అనుసంధానం చేశారు. ఎంపీసీ విద్యార్థులు 2,74,007 మంది, బైపీసీ విద్యార్థులు 1,33,415 మంది ప్రాక్టికల్స్‌కు హాజరు కానున్నారు. ఇక ఒకేషనల్ విద్యార్థులు మరో 1,18,770 మంది ఈ పరీక్షలు రాస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం 7,559 మంది ఎగ్జామినర్లను నియమించారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు చదివే ఆయా కళాశాలల లాగిన్‌లో వీటిని అందుబాటులో ఉంచింది. కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించి ఈ హాల్‌టికెట్లు పొందవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. హాల్ టికెట్ల విషయంలో విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 9240205555 అనే టోల్‌ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.
ఇక థియరీ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీతో ప్రారంభమవుతాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలన్నీ కలిపి మార్చి 18వ తేదీతో ముగుస్తాయి. ఇప్పటికే థియరీ పరీక్షల ఫ్రివ్యూ(నమూనా) హాల్ టికెట్లను కూడా అందుబాటులో ఉంచారు. ప్రాక్టికల్ పరీక్షలు ముగియగానే… తుది హాల్ టికెట్లను విడుదల చేస్తారు.
ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
27- 02 -2026 : పార్ట్ 2 – ఇంగ్లీష్ పేపర్ -1
02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1
సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
28- 02 -2026 : పార్ట్ 1 – ఇంగ్లీష్ పేపర్ -2
04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1








