Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌కు దూసుకొస్తున్న బులెట్‌ ట్రైన్……

Share

  • హైదరాబాద్‌కు దూసుకొస్తున్న బులెట్‌ ట్రైన్
  • తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
  • హైదరాబాద్ ను కలువనున్న మూడు కారిడార్లు

హైదరాబాద్, మహా : కేంద్ర బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం కీలక మౌలిక వసతుల ప్రకటన చేసింది. నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఏడు కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు దూసుకొస్తున్న బులెట్‌ ట్రైన్- అమరావతి మీదుగా చెన్నైకు వెళ్తోందంటూ గుడ్ న్యూస్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడిన ఆమె.. ఈ హై-స్పీడ్ రైలు కారిడార్లు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, వ్యాపారం, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా మెట్రో నగరాలు, ఆర్థిక కేంద్రాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని చెప్పారు. దీనిలో భాగంగా.. 7 నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పుణె – హైదరాబాద్
ముంబయి – పుణె
హైదరాబాద్ – బెంగుళూరు
హైదరాబాద్ – చెన్నై
ఢిల్లీ – వారణాసి
వారణాసి – సిలిగుడి

ఇవి నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు దోహదం చేస్తాయని తెలిపారు. దేశంలో 7 నగరాలను కలుపుతూ వేస్తోన్నఈ హైస్పీడ్ రైలు కారిడార్‌లో హైదరాబాద్​ను మూడు కారిడార్లు కలుస్తాయి. ఈ రైలు కారిడార్లు అమలులోకి వస్తే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందడమే కాకుండా లాజిస్టిక్స్ రంగానికి కూడా బలమైన మద్దతు లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిర్మాణ దశలోనే కాకుండా ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.