Mahaa Daily Exclusive

  బడ్జెట్ 2026: సామాన్యుడికి ఊరట.. ఏ వస్తువులు చౌక? ఏవి ప్రియం?

Share

  • ఏ వస్తువులు చౌక? వేటి ఖరీదు పెరిగింది?
  • బడ్జెట్ 2026లో కొత్త పన్ను శ్లాబులను ప్రకటించిన నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, మహా : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం సమర్పించిన బడ్జెట్‌లో చాలా ముఖ్యమైన ప్రకటనలు చేశారు. వీటిలో, సామాన్య ప్రజలకు అతిపెద్ద, అత్యంత భరోసా కలిగించే వార్త ఏంటంటే తోలు బూట్లు, వస్త్ర ఎగుమతులు చౌకగా మారాయి. మైక్రోవేవ్‌లు, సౌరశక్తి సంబంధిత ఉత్పత్తులు, క్యాన్సర్ మందులు కూడా చౌకగా మారాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యం వైపు వెళ్లడంలో కీలకంగా నిరూపితమవుతుందని గమనించాలి. దేశం అధిక అమెరికా సుంకాలను ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఈ బడ్జెట్‌ను సమర్పించారు.

బడ్జెట్ లో ఖనిజాలు, స్క్రాప్, మద్యం ఖరీదైనవిగా మారాయి. తోలు, వస్త్రాలు, విదేశీ ప్రయాణం, 17 క్యాన్సర్ మందులు, మైక్రోవేవ్ ఓవెన్లు, బూట్లు, విమానాల తయారీకి సంబంధించిన వస్తువులు, ఈవీ బ్యాటరీలు, డయాబెటిక్ మందులు, తోలు , వస్త్రాల ఎగుమతి, బయోగ్యాస్ మిశ్రమ సీఎన్ జీ తదితరాలన్నీ చౌకగా మారతాయి.

ఏది చౌక అయింది

బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీలు తగ్గించడం, మినహాయింపులు ఇవ్వడం వల్ల కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. ఇవి ముఖ్యంగా ఎక్స్ పోర్ట్ ప్రమోషన్, హెల్త్ కేర్, మేక్ ఇన్ ఇండియా సపోర్ట్ కోసం లెదర్ ప్రొడక్ట్స్ – ఎక్స్ పోర్ట్స్ కోసం స్పెసిఫైడ్ ఇన్ పుట్స్ పై డ్యూటీ-ఫ్రీ ఇంపోర్ట్స్, యూఎస్ టారిఫ్ నుంచి రిలీఫ్. మొబైల్ ఫోన్లు ఈవీ బ్యాటరీలు – కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు, మేక్ ఇన్ ఇండియా సపోర్ట్. మైక్రోవేవ్ ఓవెన్స్, పార్ట్స్ – లోయర్ కస్టమ్స్ డ్యూటీ కిందకు వస్తాయి. క్యాన్సర్ మందులు, లోయర్ కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ కేర్ రిలీఫ్ కిందకు రానున్నాయి. సోలార్ ప్యానెల్స్పై డ్యూటీ తగ్గించారు. లిథియం బ్యాటరీ కాంపోనెంట్స్పై కూడా డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించి ఎలక్ట్రిక్ వాహనాలను మరింతగా ప్రోత్సహించేందుకు మార్గాలను సుగమం చేశారు. సివిలియన్ ఎయిర్ క్రాప్ఠ్ పార్ట్స్ , ట్రైనింగ్ ఎక్విప్ మెంట్ – లోయర్ కస్టమ్స్ డ్యూటీ కిందకు తీసుకు వచ్చారు. 7 రేర్ డిసీజెస్ మెడిసిన్స్పై పన్నును రద్దు చేశారు. డయాబెటిస్ మెడిసిన్స్ ఇతర ఎసెన్షియల్ డ్రగ్స్కు పన్నును తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఖేలో ఇండియా మిషన్ ను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో క్రీడాపరికరాలపై పన్నను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇంపోర్టెడ్ పర్సనల్ యూజ్ ఐటమ్స్ లోయర్ టారిఫ్స్ విధిస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లెట్స్ పై డ్యూటీ తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ పై టాక్స్ రిలీఫ్ వర్తింప చేస్తామన్నారు. బంగారంపై పన్నును సరళీకరణ చేస్తామన్నారు.

ఏది కాస్లీ అంటే

మేకిన్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు కొన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ పై ఎగ్జెంప్షన్లు తొలగించడం లేదా హయ్యర్ కస్టమ్స్ డ్యూటీలు విధించడం వల్ల ధరలు పెరుగుతాయి.
లగ్జరీ వాచెస్ – హయ్యర్ కస్టమ్స్ డ్యూటీలు, ఇంపోర్ట్ ప్రొటెక్షన్, ఇంపోర్టెడ్ ఆల్కాహార్ – హయ్యర్ టారిఫ్స్, డిజైనర్ క్లాత్స్ – మేకిన్ ఇండియా సపోర్ట్. ఇంపోర్టెడ్ జ్యువెలరీ – హయ్యర్ కస్టమ్స్, లోకల్ మాన్యుపాక్చరింగ్ ప్రోత్సాహం కిందకు తీసుకు వచ్చారు.