Mahaa Daily Exclusive

  మీ కళ్ళు మొక్కుతా ఒకసారి ఓటు వేయండి :మేడ్చల్ ఎంఎల్ ఏ .మల్లారెడ్డి

Share

శామీర్ పేట్, మహా:: కాళ్లు మొక్కుతా దయచేసి ఒక్కసారి ఓటు వేయండి అని అంటున్నా ఎమ్మెల్యే మల్లారెడ్డి.. ఆదివారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లాక్ష్మపూర్ లో 3,5 వార్డ్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దయచేసి ఈ ఒక్కసారి ఓటు వేసి బిఅర్ఎస్ బలపరచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించలి మీ కళ్ళు మొక్కుతా అని లాక్ష్మపూర్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ , నీళ్లు కట్ ఐయ్యాయి రేవంత్ రెడ్డి వచ్చాక తెలంగాణ కు దిష్టి పట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి ఎన్నికల ఇంచార్జ్ భద్రారెడ్డి , మాజీ ఎంపిటిసి నాగరాజు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.