Mahaa Daily Exclusive

  కెసిఆర్ కు సిట్ నోటీసులకు వ్యతిరేకంగా జవహర్ నగర్ భారీ నిరసన..

Share

  • కెసిఆర్ కు సిట్ నోటీసులకు వ్యతిరేకంగా జవహర్ నగర్ భారీ నిరసన
  • మున్సిపాలిటీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం
  • మాజీ మేయర్ మేకల కావ్య అధ్యక్షుడు కొండల ముదిరాజ్.

జవహర్ నగర్, మహా: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాజకీయ దురంధరుడు, అనుభవశాలి, బంగారు తెలంగాణ రూపకర్త, కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై రాజకీయ ప్రతీకారంతో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తెలంగాణ ఆత్మ గౌరవం పై జరిగిన దాడిగా పేర్కొంటూ బృహత్ మహానగర పరిధిలోని జవహర్ నగర్ చెన్నాపురం చౌరస్తాలో బి ఆర్ఎస్ శ్రేణులు ఆదివారం భారీ ఎత్తున నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య జవహర్ నగర్ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడుతుందని బిఆర్ఎస్ పార్టీని భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఆగం చేయాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందని ఈ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కక్షలు పగలు ప్రతీకారాలకు రాజకీయ పార్టీలు వేదికలు కాకూడదని, 6 గ్యారంటీ పథకాలతో అదరగొట్టిన కాంగ్రెస్ పథకాలు అమలు చేయలేక చతికిల పడిందని, ప్రజల దృష్టి మరల్చడానికే సిట్ పేరిట కొత్త డ్రామాకు తెర లేపారని తెలిపారు. జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నోటీసుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలిగించినా తెలంగాణ సమాజంతో పాటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఊరుకోరని, రోజుకో డ్రామాలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు హామీ లు అమలు చేయాలని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలోఆలూరి రాజశేఖర్, శోభా రెడ్డి, సుధాకర్ చారి, బండ కింది ప్రసాద్, పల్లపు రవి, దిలీప్, అశోక్ ,బోయిన్పల్లి నరసింహ, పరుశురాం, దివాకర్, అహ్మద్ బాషా, విలాసాగర్ రవి, కొమురయ్య, మహిళా కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.