Mahaa Daily Exclusive

  పాషా ఖాద్రి మృతి పట్ల సీఎం సంతాపం…

Share

 

హైదరాబాద్, మహా: చార్మినార్ మాజీ శాసనసభ్యుడు, ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ పాషా ఖాద్రీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన సయ్యద్ పాషా ఖాద్రీ మైనారిటీల సంక్షేమం కోసం విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఖాద్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.