- పవన్.. ఓ దిష్టికల్యాణ్
- పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్
- మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండుసున్నానే
హైదరాబాద్, మహా : పవన్ కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్.. ఓ దిష్టి కల్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు ఏపీలో చేసుకోవాలని ఆయన తెలంగాణ వ్యతిరేకి అని, గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. పవన్ చెప్పారని ఇక్కడ ఎవరూ ఓటు వేయరన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రాబోతోందని జోస్యం చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టిన ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మతం పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక అందులో భాగమే తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఉండాలని హెచ్చరించారు. మత వైషమ్యాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించరన్నారు. భైంసా అల్లర్ల వల్లే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుందని తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.







