- కళ్ళు పోతున్నాయి
- నరకంగా మారిన రాత్రి ప్రయాణం
- ప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్లు
- సగం లైట్ స్టిక్కర్ నిబంధన జాడలేదు
హైదరాబాద్, మహా : రాత్రి 7గంటల తరువాత వాహనాలు నడపాలంటే భయమేస్తోంది. ఎదురొచ్చే వాహనాల ఎల్ఈడీ లైట్స్ వల్ల కళ్లు కనిపించకుండపోతున్నాయి. కొత్తగా వచ్చే వాహనాలు ఎల్ఈడి లైట్స్ తో వస్తున్నాయి. ఆర్టీవో అధికారుల పర్యవేక్షణ కరువు. నియంత్రణ జాడ ఎక్కడ లేదు. గతంలో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నిబంధన ఉండేది. ఆ రూల్ తీసేసారో ఉందో తెలీదు. ఎల్ఇడి లైట్ ల వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక కళ్ళు మసకబారి ఏమీ కనపడకుండా పోయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, కనుక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్స్ లకు వస్తున్న ఎల్ఈడీ లైట్ల గురించి చర్య తీసుకొని కనీసం హెడ్ లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ, బ్లాక్ పెయింట్ కానీ వేయాలనే రూల్ ను పునరుద్దరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Post Views: 9







