Mahaa Daily Exclusive

  ప్రాణం తీసిన న్యూడ్ మార్ఫింగ్ బ్లాక్‌మెయిల్

Share

  • ప్రాణం తీసిన న్యూడ్ మార్ఫింగ్ బ్లాక్‌మెయిల్
  • సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్, మహా : రాంనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రేమ్ కుమార్ (36) న్యూడ్ ఫోటో మార్ఫింగ్ బ్లాక్‌మెయిల్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తుతెలియని దుండగులు అతని మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలను పంపిస్తూ, వెంటనే రూ.3 వేలు చెల్లించకపోతే అతని కుటుంబ సభ్యులందరి న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తామని బెదిరించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో బాధితుడి భార్య, కుటుంబ సభ్యులు ధైర్యం చెబుతూ, గుర్తు తెలియని వారికి డబ్బులు పంపితే మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తారని, భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేద్దామని సూచించారు. అయినప్పటికీ, నిందితుల బెదిరింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ప్రేమ్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సైబర్ నేరగాళ్లు చేసే బ్లాక్‌మెయిల్‌కు భయపడకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్
క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఒకసారి డబ్బులు చెల్లిస్తే సమస్య తీరదు. ధైర్యంగా వ్యవహరించడమే సరైన మార్గమని చెబుతున్నారు.