Mahaa Daily Exclusive

  ‘ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్మితే ఊరుకోం’: గుమ్లాపూర్ బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌ నేతలకు మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక

Share

  • ప్రజా ప్రభుత్వం పై విషం చిమ్మడమేంటి..?
  • అభివృద్ధి పనులు చేస్తుంటే కడుపు మండిపోతుంది ప్రతిపక్షాలది..
  • హరీష్ రావు కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు..
  • ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు..

గుమ్లాపూర్ బహిరంగసభలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు హెచ్చరిక..

కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో బృహత్తరమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే టిఆర్ఎస్ నేతలకు కంటగింపుగా మారిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలుగా విషం చిమ్ముతున్నారని అడుగు అడుగునా అభివృద్ధి పనులకు అడ్డు తలుగుతున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. విమర్శకు ప్రతి విమర్శ చేయాలని హద్దులు దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. టిఆర్ఎస్ నేతల వైఖరిని తూర్పారబట్టారు. విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచి విద్యారంగా అభివృద్ధికి దోహదపడుతున్నదని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిందని తెలిపారు. ఒక సంవత్సర కాలంలోనే దేశంలోనే ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా 70 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత సన్నబియ్యం వంటి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. టిఎస్పీఎస్సీ ద్వారా 70 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ధర్మపురి కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమానికి యంగ్ ఇండియా మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమ లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారని, రైతులు, నేత కార్మికుల సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. పెండింగ్ అభివృద్ధి పనులను ప్రాధాన్యతనుబట్టి పూర్తి చేస్తామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం పాటు పడతామని ప్రణాళిక ప్రకారం పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రికి ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. రైతు బీమా రైతు భరోసా రైతు రుణమాఫీ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. రైతుల సంక్షేమ లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

కొండగట్టు అంజన్న క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించండి..

నారాయణపూర్ రిజర్వాయర్ ను పూర్తి చేయండి..

చొప్పదండి నియోజకవర్గం ససస్ సామలమవుతుంది..

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఓటి కెనాల్స్ ఏర్పాటు జరిగిందని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణకు మిగిలిన నిధులను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు. తద్వారా కొండగట్టు ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులను ప్రభుత్వం సత్వరమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ద్వారా చొప్పదండి నియోజకవర్గం లో సాగునీటి బాధ తీరుతుందని చొప్పదండి సస్యశ్యామలంగా మారుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చొప్పదండి నియోజకవర్గంకి ఏటిసి డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకట్ కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్రావు ఆరేపల్లి మోహన్ కోడూరు సత్యనారాయణ గౌడ్ వైద్యుల అంజన్ కుమార్ ప్రణవ్ మహేందర్ రెడ్డి రుద్ర సంతోష్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ సభ సక్సెస్…

గుమ్లాపూర్ లో ముఖ్యమంత్రి నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ అయింది. డిసిసి అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు సభను సక్సెస్ చేయించడంలో కీలకంగా విహరించారు. వేలాదిమంది ప్రజలు మహిళలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పార్టీ శ్రేణులు తరలివచ్చారు. వేల సంఖ్యలో స్వశక్తి మహిళలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం కూడా వారిని మెచ్చుకున్నారు. మా అక్కలు పెద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చారని ఆనందం వ్యక్తం చేశారు సీఎం మొత్తానికి సీఎం సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.