- మున్సిపల్ పరిధిలో కంది శ్రీనివాస రెడ్డి ప్రచార యాత్ర
- బల్దియా పీఠమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అసెంబ్లీ ఇంచార్జి
- పలు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున ప్రచారం
- గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి
ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ మున్సిపాలిటి అభివృద్ధి చెందాలంటే అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులనే గెలిపించాలని అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా శుక్రవారం 5,6,7,8,10,11వార్డులలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం హస్తగతం చేసుకునేలా ఓటర్లు ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. మున్సిపల్ పరిధిలోని కాలనీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని , అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. త్వరలో ప్రతీ మహిళకు 2500 పథకం అమల్లోకి రానుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 500లకే గ్యాస్ సిలిండర్, 2వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం పంపిణీ లాంటి మంచి పథకాలతో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందుకే ఇంకా మంచి పథకాలు అమలు కావాలంటే ఆదిలాబాద్ అభివృద్ది చెందాలంటే చేతి గుర్తుకే ఓట వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, మాజీ డీసీసీబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి, బాలూరి గోవర్ధన్ రెడ్డి,మాజీ జడ్పిటిసి కొండా గంగాధర్, లోక ప్రవీణ్ రెడ్డి, రంగినేని శాంతన్ రావు, పత్తి ముజ్జు, ప్రభాకర్, ముడుపు ప్రశాంత్, శ్రీలేఖ ఆదివాసీ, ప్రశాంత్,రాంరెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







