- జహీరానగర్ ఈద్గా గ్రౌండ్ ఆక్రమణ అన్యాయం
- మైనారిటీలతో కలిసి బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి నిరసన
ఖైరతాబాద్,
ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీ డివిజన్ జహీరానగర్ పరిధిలో ఈద్గా గ్రౌండ్ ను గత 13 సంవత్సరాలుగా స్థానిక కార్పొరేటర్ కవితా రెడ్డి , బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీ లు వినియోగించుకుంటుండగా, ఇపుడు మైనారిటీలు వినియోగించుకోకుండా ఎమ్మెల్యే దానం నాగేందర్, టీజీపీడీసీఎల్ చేయడంపై మైనారిటీలు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి , వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ మసిఉల్లా ఖాన్ తో కలిసి ఘటన స్థలానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిస్సార్, జావిద్, నవీద్, షఫీక్, గౌస్, జావీద్, అంజద్, ఖలీల్, వసీం, సింగిన్ ఖాన్, తోపాటి స్థానిక నాయకులు, మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 12







