Mahaa Daily Exclusive

  రేవంత్, కేసీఆర్ మధ్య ఢిల్లీ స్థాయిలో ఒప్పందం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

Share

  • కేసీఆర్ కు చిప్పకూడు ఎందుకు తినిపించడం లేదు?
  • ఢిల్లీ స్థాయిలో ఒప్పందం వల్లే కేసీఆర్ ను టచ్ చేయట్లే
  • సీఎం రేవంత్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
  • అల్లుడు కూతురు మాట్లాడుకుంటే కూడా విన్న దుర్మార్గుడు కేసీఆర్
  • ప్రగతి నిధులు మావి.. పేరు పెత్తనం మీదా?

షాద్ నగర్, మహా,

రాష్ట్ర మంత్రులు ఊర్లు పంచుకుని దోపిడీకి పాల్పడుతున్నారని. కేసిఆర్ కు చిప్పకూడు తినిపిస్తా అని పదేపదే అన్న రేవంత్ రెడ్డి రెండున్నర సంవత్సరాలుగా ఏమీ అనకుండా ఉండడానికి కారణం ఢిల్లీ స్థాయిలో రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదరడమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణానికి షాద్ నగర్ టౌన్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న కెసిఆర్ పాలన అంతమైందని, కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో కాంగ్రెస్ పాలన మొదలైందని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలని అన్నారు. తెలంగాణను రక్షించాలంటే బిజెపిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు మూడున్నర లక్షల కోట్లతో హై స్పీడ్ రైలు ఎలివేటర్ కారిడార్ రాబోతుందని అన్నారు. పాలమూరు జిల్లాకు 50 వేల కోట్ల రూపాయల రైల్వే మీద కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా రేవంత్ రెడ్డిమార్చారన్నారు. రాష్ట్రంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష మార్చుకోవాలని ఉద్యోగులకు సంబంధించిన ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని దోచుకోవడం దాచుకోవడం కాంగ్రెస్ పార్టీ అజెండా అని టిఆర్ఎస్ కారుకు ఉన్న నాలుగు టైర్లకు నలుగురు తీసుకొని తిరుగుతున్నారని అల్లుడు కూతురు మాట్లాడుకుంటే కూడా ఆ మాటలు చాటుగా విన్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దోచుకోవడం.. దాచుకోవడమేనా?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనైనా.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోనైనా రాష్ట్రాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు కేంద్రాన్ని.. పేరు పెత్తనం మాత్రం అప్పుడు బీఆర్ఎస్ ది.. ఇప్పుడు కాంగ్రెస్ ది.. వీళ్లకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరి ఏది చేతకాదు.. అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ధ్వజమెత్తారు. ఇన్నేళ్లలో తెలంగాణ వెనుకబాటుకు, తెలంగాణకు జరిగిన అన్యాయానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించి వివాదాలను సృష్టించిందని ఆరోపించారు. ఈ ఎన్నికలు కేవలం మున్సిపాలిటీ ఎన్నికలు మాత్రమే కావని, ఇది తెలంగాణ భవిష్యత్తు అని పేర్కొన్నారు. తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లు లోకల్ బాడీలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు.షాద్ నగర్ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ తరహాలో మారాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఊళ్లను, శాఖలను పంచుకొని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో తెలంగాణకు ఏమీ చేయలేదని కాంగ్రెస్ విమర్శిస్తుందని, హై స్పీడ్ రైల్ ఎలివేటర్ కారిడార్ 300 కోట్ల రూపాయలతో తెలంగాణకు వస్తుందని గుర్తు చేశారు. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 50 వేల కోట్లు ఖర్చు పెడుతుందని, అందులో షాద్ నగర్ కు కూడా భాగస్వామ్యం ఉందని అన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించి అత్యద్భుతమైన రవాణా ప్రగతి తీసుకొచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని దేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బిజెపి నేతలు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, కక్కునూరు వెంకటేష్ గుప్తా, డాక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.