ఢిల్లీ, మహా
రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. జో ఉచిత్ సమ్జో వహీ కరో అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం ఉదయం చేపట్టిన నిరసనలో పాల్గొన్న రాహుల్, ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జో ఉచిత్ సమ్జో వహీ కరో అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన కొనసాగించారు. భారత్, అమెరికా డీల్‌ను ట్రాప్ డీల్‌గా వర్ణిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ సమయంలో వారితోపాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొని నినాదాలు చేశారు. అప్పుడే మీడియాతో మాట్లాడుతూ, జో ఉచిత్ సమ్జో వహీ కరో అంటూ విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మోదీ ప్రసంగం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని, ప్రతిపక్షం లేవనెత్తిన కీలక అంశాలకు ప్రధాని సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. జాతీయ భద్రత, చైనా అంశాలపై తమ ఆందోళనలకు సరైన సమాధానం రాలేదనే కారణంతో సభను బహిష్కరించామని ఖర్గే తెలిపారు.







